కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నెహ్రూ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు.. వీర్ సావార్కర్ ను ప్రమోట్ చేస్తున్నారని, వీర్ సావార్లర్ బ్రిటీష్ వాళ్లకు సహకరించాడని ఆయన అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో బ్రిటీష్ వాళ్లతో కాంప్రమైజ్ అయ్యాడని, వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి ఏజెంట్ గా పనిచేశాడని వీహెచ్ వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్ళతో పోరాడిన వారు దేశ భక్తులా… లేక బ్రిటీష్ వాళ్లకు లొంగీ పనిచేసిన వీర్ సావర్కర్ దేశ భక్తుడా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Fake Degree: ఫేక్ డిగ్రీతో 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం.. గెజిటెడ్ హోదా.. శిక్ష విధించిన కోర్టు..
వీర్ సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు వీహెచ్. దేశంలో చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. బీజేపీలో ఎవరూ స్వతంత్ర సమరయోధులు లేరని, టిప్పు సుల్తాన్ వారసులను దేశం నుంచి వెళ్ళగొట్టాలి అంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు అనడం దుర్మార్గమన్నారు. రాముడిని పూజించే వాళ్ళే దేశంలో ఉండాలని చెప్పడం సరికాదని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేసి.. రిజర్వేషన్స్ ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ నాయకులు అదానీ గురించి ఎందుకు మాట్లాడరని ఆయన అన్నారు.
Also Read : Asaduddin Owaisi: గోసంరక్షకులకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది.. భివానీ హత్యలపై అసదుద్దీన్ ఓవైసీ