రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సంకల్ప్ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. అణిచివేత ,అప్రజాస్వామిక విధానం బీజేపీ కొనసాగిస్తోందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. రాహుల్ గాంధీకి అందరం కొండంత అండగా ఉండాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికారం కోసం మాత్రమే బీజేపీ వచ్చిందని ఆయన అన్నారు. అందరి అభ్యున్నతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు జానారెడ్డి. ఐక్యమత్యంతో అందరం ఒక్కటిగా పోరాడుతామని, ఇదే ఐక్యతతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుకుపోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలన్నారు. పార్టీలో పని చేస్తున్న వారిని గుర్తించాలన్నారు.
Also Read : Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
అనంతరం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీపై వేటు వేయటం అన్యాయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికీ తీసుకొని వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. అదానీ కుట్ర బయటపెడ్తారన్న భయంతోనే రాహుల్ గాంధీని అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.
Also Read : Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ