Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ‘సీమాంచల్ అధికార యాత్ర’లో ప్రసంగిస్తూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం నితీష్ కుమార్ వల్లే తమ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారంటూ మండిపడ్డారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచ్ ప్రాంతంలో ఓవైసీ మూడు రోజులు పర్యటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీమాంచల్ ప్రజలపై చూపిస్తున్న విపక్షకు వ్యతిరేకంగా మార్చి 18, మార్చి 19 తేదీల్లో ‘సీమాంచల్…
టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.
Karnataka: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై ముస్లింలు మండిపడుతున్నారు. ఆయన ఇటీవల నమాజ్, అల్లాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సంఘాల సభ్యులు భారీగా చేరుకుని ఆజాన్ పఠించారు. భారీగా హాజరైన ముస్లింలు ప్రార్థనలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ముందు కూడా ఇదే విధంగా చేస్తామని హెచ్చరించారు.
Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు సర్వ నాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కాలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా రోడ్డు పై కాంగ్రెస్ నిరసన తెలిపారు.
రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు, ఆయన వెంట ఉన్న వాళ్లందరూ దొంగలు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లలో సమానం అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగినంత స్థాయిలో ప్రభావితం చూపించలేకపోయింది.. చెల్లని ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లే తక్కువ అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. ఈ ఫలితాలపై విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో శాసన మండలి ఎన్నికల్లో ఐదు చోట్ల…
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఏఐఏడీఎంకే పార్టీకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదురుతోంది.