BJP Leader Murder: కలకలం రేపుతోన్న బీజేపీ నేత హత్య.. నాటు బాంబులతో దాడి, కత్తులతో నరికి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Murder: పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ నేత హత్య సంచలనం రేపుతోంది.. మంగళం నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా ఉన్న సెంథిల్‌కుమార్.. గత రాత్రి ఓ బేకరీ దగ్గర ఉండగా.. మూడు బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.. ముందుగా నాటు బాంబులతో దాడి చేసి.. ఆ తర్వాత కత్తులతో ఎటాక్ చేసి నరికి చంపారు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. బైక్‌లపై రావడం.. బాంబులు విసరడం.. కత్తులతో నరకడం.. ఇలాంటి దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి.. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే సెంథిల్‌కుమార్‌ను ప్రత్యర్థులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. ఇక, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. స్థానిక సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ చేసింది..
Read Also: WPL 2023 : ముంబయి ఇండియన్స్ జట్టు గెలచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
సెంథిల్‌కుమార్ (వయస్సు 46). భాజపాకు చెందిన ఆయన మంగళం నియోజకవర్గ ఇంచార్జిగా కూడా ఉన్నారు.. పుదుచ్చేరి హోం మంత్రికి మద్దతుదారుగా ఉన్నారు.. మంగళం నియోజకవర్గం అరియూరులో గత రాత్రి జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. అనంతరం విలియనూర్ కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ ప్రైవేట్ బేకరీ దుకాణంలో టీ తాగుతున్నారు. అప్పుడు 3 ద్విచక్రవాహనాలపై ముసుగులు ధరించిన 9 మంది ముఠా అక్కడికి వచ్చింది. అనంతరం అకస్మాత్తుగా సెంథిల్‌కుమార్‌పై నాటు బాంబును విసిరారు. సెంథిల్‌కుమార్ సమీపంలో బాంబు పడి పేలింది. దీంతో షాక్‌కు గురైన సెంథిల్‌కుమార్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ముఠా మరో నాటు బాంబును విసిరింది. బాంబు అతనిపై పడి పెద్ద శబ్ధంతో పేలింది. బాంబు పేలుడు ధాటికి కిందపడిపోవడంతో ఆయన్ని చుట్టుముట్టి కొడవళ్లతో నరికి చంపారు. ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతిచెందాడని ధృవీకరించుకున్న తర్వాత ఆ ముఠా మెరుపు వేగంతో మోటార్‌సైకిళ్లపై అక్కడి నుంచి పారిపోయింది.
ఇక, హత్య సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య, పోలీస్ సూపరింటెండెంట్ రవికుమార్, విలియనూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వేలయ్యన్, సబ్ ఇన్‌స్పెక్టర్ వేలు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కతిర్‌గామం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మంత్రి నమచివాయం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. హంతకులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. శత్రుత్వం కారణంగా హత్య చేశారా? లేక మరేదైనా కారణమా? అనేదానిపై ఆరా తీస్తున్నారు.. బేకరీ షాపులో అమర్చిన నిఘా కెమెరాలో నమోదైన దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన కొద్దిసేపటికే సెంథిల్‌కుమార్ మద్దతుదారులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!