Ajit Pawar: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలకు విస్తరించిందని ఆయన శనివారం అన్నారు. మోడీ గెలిచిన తర్వాత ప్రజాదరణ పొందారని, బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గెలిచిందని,
Kiren Rijiju: 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా శనివారం ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిపై ప్రభుత్వం సైలెంట్ గా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీకి కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. శుక్రవారం బీజేపీ పెద్దల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బిజీబిజీగా గడపుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు.
CR Kesavan: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు సిఆర్ కేశవన్ శనివారం బిజెపిలో చేరారు. దక్షిణాదిలో మరింగా విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో కాంగ్రెస్కు మరో షాక్ తగిలినట్లు అయింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి…
రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం సరైంది కాదన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యాలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. అదానీ విషయంలో ప్రతిపక్షాల దూకుడును కొట్టిపారేసిన శరద్ పవార్ వ్యాఖ్య మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థలో చిచ్చు రేపింది.