అక్రమంగా నిర్మించిన స్టూడియోలపై ముంబై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన డజన్ల కొద్దీ ఫిల్మ్ స్టూడియోలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు ప్రవేశించాయి. వీటిని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ రక్షణలో నిర్మించారని బిజెపి ఆరోపించింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆధారంగా రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు వేయడంపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పేర్కొన్నారు. కౌశాంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల సర్వతోముఖ సంక్షేమం కోసం 2024లో మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు.
కరీంనగర్ జైల్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అయ్యారు. సంజయ్ విడుదల నేపథ్యంలో జైల్ వద్ద ప్రదర్శనలు, ర్యాలీ లేకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది.