Vizag Steel Plant: ఆ విషయం బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.. లేదంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకరేపుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటిస్తున్న సింగరేణి డైరెక్టర్ల బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్‌లో పర్యటిస్తున్నారు.. ఈవోఐ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు.. మరో రెండు రోజుల పాటు విశాఖలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనుంది.. అయితే, ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్‌గానే స్పందిస్తోంది.. ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. బిడ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టే అంటున్నారు.
ఇక, రాజకీయ కారణాలతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని తెలిపారు మంత్రి అమర్నాథ్.. బీఆర్‌ఎస్‌కు, బీజేపీతో ఉన్న రాజకీయ విబేధాలకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ, బిడ్ లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే అంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే బిడ్ లో పాల్గొంటాం అంటే అర్థం ఏంటి? అని నిలదీశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే మాతో పాటు కలిసి వస్తే ఆహ్వానిస్తామన్న ఆయన.. ప్రజల సెంటిమెంటును గౌరవిస్తారా? లేదా? చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతందని స్పష్టం చేశారు.. ప్రజల సెంటిమెంటును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
అసలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే అర్హత లేదన్నారు మంత్రి అమర్నాథ్.. కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖ గత ఏడాది ఈ నిబంధనను వెల్లడించిందన్న ఆయన.. ఈ నిబంధన ఉంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎలా బిడ్‌లో పాల్గొంటుంది? అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. మొత్తంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కాకరేపుతోంది. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..