బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్, బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
రైల్వే భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. తేజస్వి ఉదయం 11 గంటలకు విచారణలో చేరే అవకాశం ఉంది. ఇదే కేసులో మార్చి 25న తేజస్వీ యాదవ్ ను సీబీఐని ప్రశ్నించింది.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ తరఫున పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలికవసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో…
పేపర్ మాల్ ప్రాక్టీస్‌లో తన ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. తన సెల్‌ఫోన్‌కు ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి ఫోన్లు వచ్చాయా అని పోలీసులు అడిగారన్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2024 ఏప్రిల్ లేదా మే లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి మోదీ సర్కార్ కు గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 'మీ డిగ్రీని చూపించు' ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాజకీయ నాయకులను కూడా అదే చేయాలని కోరింది.