Amit Shah: కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలబురిగి సభలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రచారాన్ని రసవత్తంగా మార్చాయి. మోడీ ‘విష సర్పం’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి ఏక్నాథ్ షిండే తప్పుకోనున్నారని ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరులో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుర్చీని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా, తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది.
టీవీ చర్చల్లో నిత్యం ఉండే జేడీ(యూ) మాజీ నేత అజయ్ అలోక్ శుక్రవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడం అనేది ఒక కుటుంబంలోకి వచ్చినట్లే అని, మోదీ మిషన్‌కు సహకరిస్తానని అజయ్ అలోక్ అన్నారు.
తమిళనాడులో దారుణం జరిగింది. బిజెపి నేత దారుణ హత్య గురయ్యారు. ప్రత్యర్ధులు కారుపై నాటు బాంబులతో దాడి చేసి నడిరోడ్డుపై చంపారు. గురువారం రాత్రి పూందిపలై హైవే నుండి కాంచీపురం వెళ్ళే చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు దిగి పరుగెత్తుకుంటూ వెలుతున్న బీజేపీ నేత శంకర్ ను వెంటాడి చంపారు.
Off The Record: ప్రధాని మోడీ విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. అభివృద్ధి, టెక్నాలజీ లాంటి అంశాల్లో మోడీతో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పినా.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న బాబు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయట. అంటే.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైపోయిందా..? అనే రీతిలో…
Karnataka Elections: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచబోతున్నాయా..? అంటే బీజేపీ ఆ విధంగానే సింపతి సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. గత అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా ఈ రోజు కలబురిగిలో జరిగిన ఓ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విషపు పాము లాంటి వాడని, బీజేపీ పార్టీ కూడా అటువంటిదే అని వ్యాఖ్యానించాడు. అతను విషపు పామా..? కదా..?…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో మనీస్ సిసోడియాను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోదీ ‘‘విషపు పాము’’అని, ఇది నిజమా కాదా..? అని తేలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని,