Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని…
దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. అత్యధిక రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. కొన్ని చోట్ల అధికారాన్ని మిత్ర పక్షాలతో పంచుకుంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అఖండ మెజార్టీ సాధించి.. దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహ రచన చేస్తోంది. మోడీ, అమిత్ షా ప్రణాళికలతో పార్టీ దూసుకెళ్తోంది.
తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఏంకే, బీజేపీ మధ్య వివాదంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోదని ప్రచారం జరుగుతోంది. ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమికి కూటమికి బీటలువారనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశం అయినట్లు సమాచారం.
Yogi Adityanath: కర్ణాటక ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను ప్రచారంలోకి దించాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్యాలో ఆయన ఎన్నికల ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధిష్టించింది. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఈరోజు ఢిల్లీ మేయర్గా తిరిగి ఎన్నికయ్యారు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లకు పైగా ఖర్చు చేశారట. ఈ మాట అన్నది మరెవరో కాదు బీజేపీ నేతలు. ఆమ్, ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, కేంద్రంలోని బీజేపీ సర్కార్కు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది.
రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని పిలుపునిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బిఎస్ యడియూరప్పపై జగదీష్ షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఒత్తిడి మేరకు యడియూరప్ప ఈ మాటలు చెబుతున్నారని షెట్టర్ అన్నారు.