Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ కర్ణాటకలో కూడా తన గురించే మాట్లాడుతున్నారని, కర్ణాటక అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన పార్టీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేరును ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. మే 10న కర్ణాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడీకి సంబంధించినవి కాదని, మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసమే అని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్లను ప్రస్తావిస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఎవరిపేర్లను ప్రస్తావించడని ఆయన అన్నారు. మోడీ వారి నాయకుల గురించి ఎప్పటికి మాట్లాడరని అన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ సమయంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అందుకనే ప్రధాని మోడీ, హోం మంత్రి పేరును ఎప్పడు ప్రస్తావించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ తన గురించి తప్పితే వేరే వాటి గురించి మాట్లాడటం లేదని, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటక ప్రజలు, అభివృద్ధి గురించి మాట్లాటం లేదని ఆయ ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాని ఏం చేసిందో కూడా చెప్పడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అవినీతిని అంతం చేయడానికి ఏం చేశారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రతీ పనిపై 40 శాతం కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడిందని ఆయన అన్నారు.