కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీలు విమర్శల జోరు పెంచాయి. బాగల్ కోట్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్ కోట్ జిల్లాలోని తెరాల్ లో జరిగిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అమిత్ షా కామెంట్స్ చేశాడు..
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు జరగుతున్నాయి. సిద్దిపేటలో మంత్రి హరీష్రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో ఆయన ప్రసంగించారు. గులాబీ నీడ కింద చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అని నేతలకు మంత్రి సూచించారు.
బీజేపీకి వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు కీలక నేతలతో భేటీలు అవుతున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన సమావేశం అయ్యారు. సోమవారం హౌరాలోని రాష్ట్ర సచివాలయం నబన్నాలో మమతా బెనర్జీని సీఎం నితీశ్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్ కలిశారు.
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 'అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది.
Vishnu Vardhan Reddy: ఆంధ్రప్రదేశ్లో ఉద్యమానికి సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వివరాలను వెల్లడించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం అన్నారు. మే 5వ తేదీ నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం నిర్వహిస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వ స్టిక్కర్లు…