BJP: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న 136 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 65 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామని భావించిన జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందింది. దాదాపుగా 34 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లను, సీట్లను సంపాదించుకుంది. బీజేపీకి పట్టున్న చోట్ల కూడా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.
Read Also: PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్‌కు 72 గంటల డెడ్‌లైన్
ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా మారిన ‘భజరంగ్ దళ్’ బ్యాన్ అంశం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే చర్చకు కారణం అవుతోంది. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కర్ణాటక మాజీ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ సమాచార లోపమే తమ ఓటమికి కారణం అని, తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు దమ్ముంటే ఇప్పుడు ‘భజరంగ్ దళ్’ని నిషేధించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇది మాకు దిగ్భ్రాంతికరమైనదని, మేము చాలా సీట్లు కోల్పోయామని, ఇది ఎప్పుడూ ఊహించలేదని అచ్యుత్ నారాయణ అన్నారు.
భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేయనీవ్వండి…. అప్పుడు మేం ఏం చేయగలమో చూపిస్తాం అంటూ సవాల్ చేశారు. శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణాదిలో ఏకైక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాన్ని కోల్పోయింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ భజరంగ్ దళ్ బ్యాన్ హామీ ఇచ్చింది. అయితే దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిషేధిత పీఎఫ్ఐ లాగే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామనడం కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలకు దారితీసింది.