సూర్యాపేట జిల్లా మఠంపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావాన్ని తెలంగాణ ఫెయిల్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవాలను కోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని కాంగ్రెస్ నేతలు కించపరిచారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను, తెలంగాణ అమరులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎక్కడ ఫెయిల్ అయిందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన అన్నారు. ’24 గంటల కరెంటు ఇవ్వడం ఫైల్ ఆ పాసా.. రైతు బీమా, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచడం.. తెలంగాణ ఫెయిల్ ఆ పాసా ఆ’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : CM Jagan: ఆర్తికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ.. పలు అంశాలపై చర్చ
అంతేకాకుండా.. కాంగ్రెస్ నేతలకు పచ్చ కామెర్లు వచ్చాయని ఆయన మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు దేశమంతా అదే చేస్తుంది.. అనేంత గొప్పగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతా అంటుండని ఆయన అన్నారు. తెలంగాణకు ఏం సాధించారని బీజేపీ నేతలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతారని ఆయన వెల్లడించారు. నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ తెలంగాణకు నిధులు విడుదల చేయాలని ఆదేశం ఇస్తే నిధులు ఇవ్వలేదు కేంద్రం అని, తెలంగాణకు అన్నింటా అన్యాయం చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పొత్తు కలుస్తా అంటుంది బీజేపీ అని, తెలంగాణకు రావలసిన నిధులు విడుదల చేస్తేనే, ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే.. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునే నైతిక హక్కు బిజెపికి ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : Sleeping Tips : రాత్రి పడుకునే ముందు ఇలా చేయకండి..!