MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Karnataka: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీజేపీ తీసుకువచ్చిన అన్ని చట్టాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకువచ్చని మతమార్పిడి నిరోధక చట్టాన్ని గురువారం కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
Bandi sanjay: త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నామని కార్యకర్తలు నిరాశ చెందవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని... బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు.
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
Amit Shah to Meet Rajamouli at His Residence: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుస్తున్నారు, తమ ప్రభుత్వ ఘనతలు చెప్పి తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన రాజమౌళితో భేటీ కానుండడం హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా…
Amit shah Tour Cancel: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యే అవకాశం ఉంది. బిపార్జోయ్ తుఫాన్ ఆయన పర్యటనను ప్రభావితం చూపనుంది.