బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయేందుకు టీనేజ్ బాలిక కిడ్నాప్ డ్రామా..
మహారాష్ట్రలో ఓ టీనేజ్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. చివరకు పోలీసు విచారణలో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు కట్టకథను అల్లింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పాల్ఘర్ లోని విరార్ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక, స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. బాలిక శుక్రవారం పని కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని విరార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ లోగా బాలిక తన సోదరుడికి వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపింది. తనను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 363 కిడ్నాప్ కింద కేసు నమోదు చేశారు. విచారణలో బాలిక కిడ్నాప్ ఫేక్ అని తెలిసింది. బాలిక తన ప్రియుడితో విమానంలో కోల్ కతా పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసు బృందం కోల్‌కతాకు వెళ్లినట్లు అధికారి తెలిపారు.
బెజవాడ దుర్గమ్మకు ఆషాడమాసం సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం సారె ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు వైదిక కమిటీ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి ఆషాడ మాసం సారె సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బెజవాడ కనకదుర్గ దేవికి నగరం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారెను సమర్పించుకున్నారు. వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్‌ను అమ్మవారికి సమర్పించడం జరిగింది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను అమ్మవారికి సమర్పించామన్నారు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ వెల్లడించింది.
ఇండియా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హతం.. కెనడాలో కాల్చివేత..
ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత కొంతకాలంగా కోరుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. కెనడాలో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రే ప్రాంతంలో గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద కాల్చి చంపబడ్డాడు. నిజ్జర్ సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా ఉన్నాడు. భారతదేశానికి వ్యతిరేకం పలు కార్యక్రమాల నిర్వహణలో ఇతని పాత్ర కీలకంగా ఉంది. భారతదేశం నుంచి పంజాబ్ వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న వేర్పాటువాద సంస్థ ‘సిక్ ఫర్ జస్టిస్’(SFJ)లో నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల బ్రాంప్టన్ సిటీలో ఖలిస్తాన్ కి మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించిన వ్యక్తుల్లో ఇతనే కీలకంగా పనిచేశాడు.
భార్యని వదిలేసి మరీ.. ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌కు దగ్గరైన వ్యక్తి
ఓపెన్‌ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ టూల్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ ప్రభావాలు, ప్రయోజనాలు, ఇబ్బందులపై పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతుంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ప్రవేశిస్తోంది. ప్రజల జీవితాలలో ఊహించని మార్పులను తీసుకొస్తోంది. చివరికి డేటింగ్, మ్యారేజ్ వంటి విషయాల్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగమైంది. తాజాగా తాను ఒక ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఓ అమెరికన్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన స్కాట్ అనే వ్యక్తి.. తాను వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించాడు. దీనివల్ల తన మ్యారేజ్ సేవ్ అయిందని అతడు చెప్పాడు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే… ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత కోసం సిద్ధం చేసిన జైలు రూమ్ ఏమైందని ప్రశ్నించారు మా సీట్ల గురించి నువ్వు మాట్లాడతావా.. బండి సంజయ్ నీకు బుద్ధి ఉందా అంటూ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఒకసారి ఆస్పత్రిలో చూపించుకో అని ఆయన అన్నారు. నీ పాదయాత్ర వెనుక కేసీఆర్ లేడా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ఆ పార్టీలో నీకు హైప్ తేవడానికి నిన్ను అరెస్టులు చేయలేదా అని ఆయన అన్నారు. ఈటల రాజేందర్ ను డౌన్ చేయడానికే.. కేసీఆర్ నిన్ను లేపింది నిజం కాదా అని ఆయన అన్నారు. గంగుల కమలాకర్, నువ్వు ఒక్కటి కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బహిరంగ స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు పొన్నం ప్రభాకర్.
నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ ఎదుర్కోళ్లు, రేపు ఎల్లమ్మ కళ్యాణం, బుధవారం రథోత్సవం జరగనుంది. 15 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనా నేపథ్యంలో 2 రోజులు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రీన్ల్యాండ్, అమీర్పేట సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఇతర రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా నేడు (సోమ), మంగళవారాల్లో ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. గ్రీన్ ల్యాండ్, మాతా ఆలయం, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను SRనగర్ టీ జంక్షన్ నుంచి SRనగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్డు, శ్రీరాంనగర్ క్రాస్ రోడ్డు, ఫతేనగర్ రోడ్డులోకి మళ్లిస్తారని పేర్కొన్నారు.
తలపట్టుకుంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్ కు ఫోన్ చేసి
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే కీలకంగా మారాయి. అయితే.. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగా సీఎం సిద్ధరామయ్య మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే రేషన్ కార్డులు ఉన్నవారికి ‘అన్నభాగ్య’ పథకం కింద 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. అన్న భాగ్య పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బియ్యం పంపిణీలో పెద్ద సమస్యే వచ్చింది. ఉచిత బియ్యం ఇవ్వడానికి బియ్యం కొనుగోలు చేయడంకోసం సీఎం సిద్దరామయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారు..తెలంగాణ సీఎం తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడటం జరిగింది. అన్యభాగ్య పథకం కింద పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణి చెయ్యడానికి తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించామని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను బియ్యం కావాలని అడిగితే మా దగ్గర అంత స్టాక్ లేదని చెప్పారని సీఎం సిద్దరామయ్య అన్నారు.
కర్ణాటకలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. 26మంది ఆఫ్రికన్ మహిళలు అరెస్ట్
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 26 మందికి పైగా ఆఫ్రికన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం బెంగళూరులోని ఎంజీ రోడ్డు, బ్రిగేడు రోడ్లలో ఉన్న బార్లు, పబ్బులపై కేంద్ర విభాగ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 26 మందికిపైగా ఆఫ్రికన్లు అనైతిక కార్యక్రమాలు చేస్తూ పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక డీసీపీ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నగరంలో భారీగా పోలీసులు తనిఖీలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో నగరంలో జరుగుతున్న నేర కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని బార్లు, పబ్బుల మీద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో డ్రగ్స్ తో పాటు అనేక ఇతర అనైతిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఆఫ్రికన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, పురుషులతో కలిపి 26 మందికి పైగా ఆఫ్రికన్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిజమైన పర్యావరణ వేత్త కేసీఆర్
నిజమైన పర్యావరణ వేత్త కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదిక మంత్రి హరీష్ రావు ..మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం కలిగి ఉన్న అరుదైన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. దూరదృష్టితో ప్రారంభించిన హరితహారం ద్వారా సీఎం కేసీఆర్ పచ్చదనంలో 7.7 శాతం వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. 14,864 నర్సరీలు, 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని హరీష్ రావు వెల్లడించారు. 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పెంచామని, కొత్తగా 273 కోట్ల మొక్కలను నాటామని ఆయన అన్నారు. నిజమైన పర్యావరణ వేత్త సీఎం కేసీఆర్ అని, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
పవన్ కి ద్వారంపూడి కౌంటర్
ద్వారంపూడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానంటూ జనసేనాని చీఫ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనే వాడు నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో మీటింగ్ పెట్టాడు అని ఆయన అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి నేను స్పందించాలి.. అస్సలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడు అని పవన్ కల్యాణ్ ను ద్వారంపుడి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ను నమ్మి వచ్చిన వారు ఎవరు ఉన్నారు.. నన్ను నమ్మిన వారు నాతోనే ఉన్నారు అని ఆయన అన్నారు.