Devendra Fadnavis: భారతదేశంలోని ముస్లింలు ఎవరూ ఔరంగజేబ్ కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలు ఎవరూ కూడా మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా గుర్తించరని మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగబాద్ లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు.
మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణం చేసిందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఇది వందల కోట్ల కుంభకోణమని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. మద్యం, విద్య, హవాలా వంటి కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.
Nitish Kumar: ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ నెల 23న నితీష్ నేతృత్వంలో పాట్నాలో విపక్షాల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆర్జేడీ, ఆప్ వంటి పార్టీలు హాజరుకాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 20న నితీష్ కుమార్ తమిళనాడు పర్యటకు వెళ్లనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ని కలిసేందుకు ఆయన వెళ్లనున్నారు. విపక్షాల ఐక్యత లక్ష్యంగా ఈ…
నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ప్రసంగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీ సావర్కర్ సంఘ సంస్కర్త, దేశభక్తుడన్నారు. సావర్కర్ గురించి తెలియకుండా విమర్శించకూడదన్నారు.