Protest Against Somu Veerraju: సోము వీర్రాజుకు నిరసన సెగ.. ప్రత్యేక హోదా ఏది..? విశాఖ ఉక్కు సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protest Against Somu Veerraju: బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది. ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏంటి..? విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి? విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఏం చేశారంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. చీరాల అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
మరోవైపు చీరాల సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజునే మోడీ ఏపీకి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రకటించారని గుర్తుచేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని విజయవాడ ప్రాంతాన్ని మోడీ అభివృద్ధి చేశారన్న ఆయన.. ఉద్యమాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారు.. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమం ముందు జగన్ సంక్షేమం బలాదూరన్న వీర్రాజు.. సీఎం వైఎస్ జగన్ అవినీతి, అప్పులు చేసి.. సంక్షేమం అందిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాలరాయాలని చూస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను జగన్ దోచుకోవాలని చూస్తున్నారు.. రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?