Kolkata gangrape: దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత మోనోజిత్ మిశ్రాతో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ క్యాంపస్‌లోని గార్డు రూంలో బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన చర్యలను నిందితులు మొబైల్స్‌లో వీడియో తీశారు. ఈ ఘటనపై టీఎంసీ పార్టీపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ వీడియో కోసం గూగూల్‌లో భారీ ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ ట్రెండ్స్ చూస్తే, కోల్‌కతా గ్యాంగ్ రేప్ వీడియోల కోసం వెతికినట్లు తెలుస్తోంది. జరిగిన అన్యాయం పట్ల కాస్తంత జాలి కూడా లేకుండా, వీడియోల కోసం కొందరు కామాంధులు సెర్చ్ చేస్తుండటం గమనార్హం. కోల్‌కతా లా విద్యార్థి అత్యాచార కేసు సందర్భంగా ప్రజలు ‘‘సెక్స్’’, ‘‘ఎంఎంఎస్’’, ‘‘పోర్న్’’, ‘‘రేప్ పోర్న్’’ వంటి సెర్చ్ వర్డ్స్ ఉపయోగించారు.
ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జూన్ 29న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. “కోల్‌కతా గ్యాంగ్‌రేప్ పోర్న్” వంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించి సెర్చ్ చేశారు. సంఘటన నివేదించబడిన వెంటనే “లా స్టూడెంట్ రేప్ వీడియో”, “కోల్‌కతా రేప్ MMS”, “కోల్‌కతా రేప్ వీడియో”, “కోల్‌కతా లా స్టూడెంట్ రేప్”, “కోల్‌కతా రేప్ పోర్న్” మరియు “కోల్‌కతా గ్యాంగ్‌రేప్ పోర్న్” వంటి పదాలతో భారీగా గూగుల్‌లో సెర్చ్ చేశారు.
Read Also: Pakistan-Russia: భారత్‌కు షాక్.. పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
ప్రమాదకర ధోరణి:
2012లో నిర్భయ ఘటన తర్వాత, ఈ దారుణమైన అత్యాచారం, హత్య తర్వాత ‘‘ఢిల్లీ రేప్ పోర్న్’’ అనే కీ వర్డ్‌తో గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఈ నేరంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పటికీ, కొందరు మాత్రం తమ లైంగిక సంతృప్తి కోసం వెతికారు. ‘‘ఢిల్లీ బస్ పోర్న్’’, ‘‘ఢిల్లీ బస్ రేప్ వీడియో’’, ‘‘ఢిల్లీ రేప్ వీడియో’’ వంటి పదాలతో సెర్చ్ చేశారు.
కోల్‌కతాలో గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఆ సమయంలో కూడా ఇలాగే ఆన్‌లైన్ సెర్చింగ్ జరిగింది. బాధితురాలి పేరుతో కనీసం 8 టెలిగ్రామ్ ఛానెళ్లు కనుగొనడం జరిగింది. వీటిలో 70,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు.
జూలై 2023లో మణిపూర్‌లో ఓ గుంపు ఇద్దరు మహిళల్ని వివస్త్రగా చేసి నగ్నంగా ఊరేగించిన సమయంలో కూడా ఇలాగే జరిగింది. “మణిపూర్ నగ్న వీడియో”, “మణిపూర్ వైరల్ వీడియో”, “మణిపూర్ రేప్ వీడియో”, “మణిపూర్ నగ్న పరేడ్” పదాలతో గూగుల్‌లో సెర్చ్ చేశారు.
మానసిక వైద్యుల ప్రకారం, లైంగిక పోర్న్ వ్యసనం, అంతర్లీన మానసిక సమస్యలు ఉన్నవారు తరుచుగా అత్యాచార వీడియోల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తారని చెబుతున్నారు.