నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎక్స్ అఫీషియో, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారు. అయితే నేటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Texas Floods: సెకన్ల వ్యవధిలో ముంచెత్తేసిన టెక్సాస్ వరదలు.. వీడియోలు వైరల్
కొన్ని నెలలుగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పెద్ద ఎత్తున విభేదాలు నడుస్తున్నాయి. మంత్రి సురేఖ భర్త మురళి బహిరంగంగానే సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ పంచాయితీ పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇరు పక్షాలు ఫిర్యాదు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేటి కౌన్సిల్ సమావేశానికి మంత్రి సురేఖతో పాటు ప్రజాప్రతినిధులంతా హాజరవుతున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు నేడు హాజరుకానున్న నాయకులు కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారా? లేదా? అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అధికార కాంగ్రెస్ నాయకులు సమావేశానికి హాజరవుతారా లేదా అని ప్రతిపక్ష నేతలు కూడా ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sekhar Kammula: ఇంతవరకూ వారితో తిట్లు పడలేదు– శేఖర్ కమ్ముల
నేటి కౌన్సిల్ సమావేశ అజెండా ప్రకారం.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పునర్నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, శానిటేషన్ పురోగతి, వర్షాకాల ప్రణాళిక, వరద ముంపు ప్రాంతాల గుర్తింపు, స్మార్ట్ సిటీ పనులు, ఓనర్ కం డ్రైవర్ల జీతాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.