బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు.
దేశ వ్యాప్తంగా సనతాన ధర్మంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాల కూటమి (INDIA)ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్, విపక్షాల కూటమిపై మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంత్‌నాగ్‌లో భారత సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని విమర్శలు చేశారు.
INDIA Bloc: ఇండియా కూటమి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ తెలిపారు. ర్యాలీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారని, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తెలిపారు.
బీజేపి విమోచన, విముక్తి దినం అంటూ.. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
One Nation One Election:‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై కేంద్రం నియమించిన కమిటీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే రోజే సమావేశం జరగనుంది. సెస్టెంబర్ 23న జమిలి ఎన్నికలకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ భేటీ అవుతుంది.
కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్‌లో పర్యటించారు. ఝంజర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై విరుచుకుపడ్డారు. బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ బాధ్యులని విమర్శించారు.
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీఎం మోడీపై మరో సారి విరుచుకుపడ్డారు. 14 మంది మీడియా యాంకర్ల వద్దకు తమ ప్రతినిధులను పంపకూడదని ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లో చేరిన పార్టీలు నిర్ణయించాయి.