Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై మరోసారి అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్ లో భారతదేశం మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడంపై హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు ప్రధాని మోడీ పుట్టిన రోజు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇవాళ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాగా.. ప్రధాని మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇవాళ్టి నుంచి 'సేవా పఖ్వాడా' అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది.
Kishan Reddy: విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసారు.
ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు.
నేడు హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు పోటాపోటీగా ‘సెప్టెంబర్ 17’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పోలీసు విభాగం అలర్ట్ అయింది.
సనాతన్ ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి సంబంధించి 'భారత్' కూటమిని బీజేపీ టార్గెట్ చేస్తోంది. తాజాగా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఓ ప్రకటన చేశారు. డీఎంకే మంత్రి చేసిన ప్రకటన చాలా దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ప్రపంచంలోని ఏ శక్తీ దానిని నాశనం చేయదని అన్నారు.
ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు బీజేపీ నేత గోదావరి అంజిరెడ్డి. ఇటీవల చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి అంజిరెడ్డి రూ.20 లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా హైదరాబాద్ కొచ్చారు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందరం స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు సభకు తరలి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైంది.. ఎన్ని హామీలు ఇచ్చిన ఓటమి తప్పదు.. అప్పుల రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.