MP Arvind : తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పిల్లకుంక ప్రధాని గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రధానమంత్రి మాట్లాడి మాటలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ కాదా అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాణ త్యాగాలకు కారణం సోనియాగాంధీ అని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు, ఆందోళనలు జరగలేదు, అదే విషయం నరేంద్ర మోడీ చెప్పారని, కాంగ్రెస్ చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారన్నారు ఎంపీ అరవింద్. యువత గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడని, సిగ్గుమాలిన కుటుంబం యువత కోసం తొమ్మిదేళ్ల కాలంలో ఏం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : ODI World Cup 2023: అశ్విన్‌ను తీసుకోవడం ఏంటి?.. బీసీసీఐ సెలెక్టర్ల ప్రణాళికలు సరిగ్గా లేవు!
Also Read
చదువుకునేందుకు స్కాలర్‌షిప్ కూడా ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టారని, తెలంగాణలో సారా ఏరులైపారుతుందన్నారు. అంతేకాకుండా.. ఏం ముఖం పెట్టుకొని కేటీఆర్ ట్విట్లు చేస్తున్నాడని, తొమ్మిదిన్నర ఏళ్ల తెలంగాణను దరిద్రులు లూటీ చేశారన్నారు. యూనివర్సిటీలను నాశనం చేశారని, చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. కుటుంబ పాలన కేటీఆర్‌ది అని, కేటీఆర్ కుటుంబం రెచ్చగొట్టడం వల్లే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కవిత వాళ్ళ అయ్య మీదనే ఒత్తిడి తేలేదన్నారు. కవిత ఒత్తిడి వాళ్ళ నాయనే వినలేదని, కవిత డ్రామాలు ఆపాలన్నారు. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఏం చేశారన్నారు. కవిత వాళ్ళ నాయన చెంపలు వాయించాలని, మహిళలకు మేలు చేయాలని ఆయనపై డిమాండ్ చేయాలన్నారు.
Also Read : Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!