ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగిన విజయ శంఖనాద్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారని ప్రధాని అన్నారు. ఇప్పుడు వీరంతా భారతదేశం యొక్క శాశ్వతమైన సంస్కృతిని నాశనం చేస్తున్నారని.. తమ అధికార దురాశతో దానిని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారని మోడీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లలో చాలా ముందుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. ఎంపీలు పార్లమెంట్‌కు హాజరు కావాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది.
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేయదని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాలమూరుపై విమర్శలు చేస్తున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయంలో పాలమూరు ప్రాజెక్ట్ అంటేనే పెండింగ్ ప్రాజెక్ట్ లుగా పేరు పడింది.. పెండింగ్ ప్రాజెక్ట్ లన్నింటిని మన సీఎం కేసీఆర్ పూర్తి చేస్తున్నారు.. ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అంటూ ఆయన తెలిపారు. ప్రతి పక్షాలు శకుని మాటలు మాట్లాడుతున్నాయన్నారు.
అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. మోడీ జీ20 వేడుకలు జరుపుకున్నారని మండిపడ్డారు. సైన్యానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేయడానికి ప్రధానికి 2 నిమిషాల సమయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వపక్ష, విపక్ష పార్టీలకు విమర్శనాస్త్రంగా మారింది. బీజేపీ జవాన్ స్టోరీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది.
Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటై తెలంగాణకు శాపంగా మారుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీస్ లు వ్యవహరించినట్లు ఉద్యమ సమయంలో వ్యవహరిస్తే ఈ అన్నా చెల్లెళ్ళు అమెరికా పారి పోయేవారని సంచలన వ్యాక్యలు చేశారు.
Kishan Reddy: నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను భగ్నం చేశారు.