దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించ కముందే ఈ భేటీని అత్యంత కీలకంగా భావిస్తుంది.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ బండారం బయటపెడితే ముఖ్యమంత్రి కుమారుడు అంత ఉల్లిక్కి పడుతున్నారు ఎందుకని డీకే అరుణ విమర్శించారు. బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. మోడీ చెప్పినట్లుగా NDA లో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు.. నిజమై తప్పక ఉండి ఉంటదని తెలిపారు.
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు.
సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము... డబ్బులు ఇచ్చింది మేమన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది...ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదని హరీష్ రావు అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని.. ఈసారి అదే గతి పడుతుందని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారని.. అప్పుడు సీఎం కేసీఆర్ ను మోడీనే వద్దన్నారని వినోద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదని ఆరోపించారు. GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ను చూసి మోడీ భయపడుతున్నారని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందూరు ప్రజా గర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు.