తొమ్మిదేళ్ళ కల్వకుంట్ల పాలన చూసి తెలంగాణ ప్రజలు విసుగు చెందారు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సింది అంత చేసింది.. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదేళ్ళ పాలన మోడీ అందించారు.. ఇండ్లు, స్కాలర్ షిప్స్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.
ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. హవేరీ జిల్లాలోని బంకాపూర్లో శనివారం జరిగిన హిందూ జాగృతి సమ్మేళన్లో బొమ్మై ప్రసంగిస్తూ.. గణపతి పండుగను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత జానారెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. దేశంలో తొమ్మిదేళ్లలో 112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశాడని తెలిపారు. మోడీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదని జానారెడ్డి…
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది.
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేటలో రూ. 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సురంగాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కాపీ కొడుతున్నారన్నారు. దేశం తెలంగాణా వైపు…
మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు.