Kishan Reddy : ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య బాధాకరమన్నారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పు చేసి మరీ కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అయ్యిందన్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పరీక్షల్లో తప్పిదాల కారణంగా వాయిదా పడడంతో తీవ్ర మనస్థాపం చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ బోర్డు తప్పిదాల కారణంగా 17 సార్లు పరీక్షలు వాయిదా పడ్డాయన్నారు కిషన్ రెడ్డి. పేపర్లు లీకయ్యాయని ఆయన మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ బోర్డు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేపర్లు లీకయ్యాయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఆవేదనకు గురయ్యారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : AAI ATC Jobs : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 456 ఉద్యోగాలు..
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
అంతేకాకుండా.. ‘ప్రభుత్వమే నోటిఫికేన్లు వేస్తుంది…ఆ పరీక్షలు వాయిదా పడేలా కోర్టుల్లో స్టే తెప్పిస్తుంది. ఇది పరిస్థితి. టీఎస్ పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాల, అసమర్థత కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహల్లో మునిగి పోయారు. ప్రవళిక ఆత్మహత్య వార్త తెలియగానే వేలాది మంది యువత అశోక్ నగర్ కు వచ్చారు. పోలీసులు విచక్షణారహితంగా యువతీ యువకులపై లాఠీ ఛార్జ్ చేసారు. మా పార్టీ ఎంపీ లక్ష్మణ్ గారిని అరెస్ట్ చేసారు. అమావనీయంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనే యావ తప్ప మరే ఎజెండా లేదు. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం 1200మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read : Ponguleti Srinivasa Reddy: ఆట మొదలైంది ఇప్పుడు.. కబ్జా లన్నీ బయటకు తీస్తాం
గంగపుత్రుల కుల సంఘాలతో పాటు సకల జనులు స్వారాష్ట్రం కోసం పోరాటం చేసారు. సాగరహారం, మిలియన్ మార్చ్, రైల్ రోకో, వంటావార్పు వంటి అనేక నిరసనలు, పోరాటాలతో రాష్ట్రం ఏర్పాటైంది. సకలజనుల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం మాత్రమే పాలిస్తోంది. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తెలంగాణ రాత రాస్తున్నరు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుల సంఘాలకు, అన్ని పార్టీలకు, ప్రజలకు డబ్బులతో మభ్యపెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు. అంగట్లో పశువుల్లా నాయకులను కొంటున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల కోసం ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!