వంగవీటి మోహన రంగా... ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా... ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే... రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా... ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాధవ్‌కు పవన్ శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీలో ఇద్దరు పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించారు. కూటమి కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాజకీయ సమన్వయంపై నేతలు చర్చించారు. జనసేన–బీజేపీ మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచే…
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్... విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను అన్నారు..
స్థానిక ఎన్నికల సమరానికి అస్త్ర శస్త్రాలతో... సరికొత్త ఊపు, ఉత్సాహంతో సిద్ధమవుతోందట తెలంగాణ బీజేపీ. పార్టీకి కొత్త సారధి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో.... ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు.
మోడీ కానుకగా.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థులకు 20 వేల సైకిళ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పంపిణీ చేయనున్నారు. రేపు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తొలిరోజు కరీంనగర్ టౌన్ టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు బండి సంజయ్ తన చేతుల మీదుగా సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు అందిస్తారు. ఇందుకోసం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. పాఠశాలలకు వెళ్లే…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అధికారం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి.
తెలంగాణ బీజేపీలో అప్పుడే పదవుల పంచాయితీ మొదలైపోయిందా? కొత్త కమిటీని వేయడం అంత తేలిగ్గా లేదా? రాష్ట్ర కమిటీ కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా… పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోందా? ఆ దిశగా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న కసరత్తు ఏంటి? Read Also: Off The Record: సొంత జిల్లా కాబట్టి సీఎం చూసుకుంటాడని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీకి కొత్త సారథి వచ్చారు. రామచంద్రరావు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా…
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గేమ్‌ప్లాన్ మార్చారా? ఇక వాళ్లకి వీళ్ళకి వదిలేయడం ఎందుకని అనుకుంటున్నారా? అందుకే తాను డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టబోతున్నారా? ఆ దిశగా ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారా? ఏ విషయంలో గేమ్ ఛేంజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి? ఎందుకు అలా మార్చాల్సి వచ్చింది? Read Also: Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా? తెలంగాణలో పవర్లోకి వచ్చి ఏడాదిన్నర దాటి పోయింది. మొదట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా… ఇప్పుడు…