Telangana : తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని రెడీ చేసుకోవాలని చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సంఖ్యను నిర్ణయించింది. జడ్పీపీలు – 31, జడ్పీటీసీలు – 566, ఎంపీపీలు…
Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అలాగే, బెంగాలీ ప్రజల పట్ల ఆ ( బీజేపీ పాలిత) రాష్ట్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై సిగ్గుపడాలి అని మండిపడింది.
అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంటున్నారా? పాత వ్యవహారాలకు కొత్త హంగులు అద్దుతున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా ఫారెస్ట్ పాలిటిక్స్?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల… పార్టీ ఏదైనా సరే… రాజకీయ నేత ఎవరైనా సరే……
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
ఇటు బీజేపీలో, అటు ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ 75 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. నాగ్ పూర్ లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా.. ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
Love jihad: హిందూ మహిళలను వలలో వేసుకుని, పెళ్లి చేసుకుని వారిని ఇస్లాంలోకి మార్చే పెద్ద కుట్రను మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ‘‘లవ్ జిహాద్’’ ద్వారా హిందూ యువతులను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇండోర్‌కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఇతను యువకులను ‘‘లవ్ జిహాద్’’ చేయాలని ప్రేరేపిస్తున్నాడు. ఈ కేసులో ఖాద్రీపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయబడింది.
Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, 75 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ కావాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని ఉపయోగించుకుని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) వంటి పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గురు పౌర్ణమి సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గోశాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను పూర్తి చేసి ముందుకు వెళ్తున్నామని.. ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు.. సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించానని తెలిపారు.
KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు.