PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కోల్‌కతా గ్యాంగ్‌రేప్‌ని ఉద్దేశిస్తూ, నిందితులను కాపాడేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రయత్నిస్తోంది, పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ. 5,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, క్లీన్ ఎనర్జీని పెంచే లక్ష్యంతో చమురు, గ్యాస్, విద్యుత్, రైల్, రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు.
Read Also: Pakistan: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని రక్షిస్తున్న పాకిస్తాన్.. ఆ ఏడుగురు ఎవరంటే..
దుర్గాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇక యువ వైద్యురాలు దారుణానికి(ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన) గురైనప్పుడు టీఎంసీ ప్రభుత్వం దోషులను రక్షించడంలో ఎలా పాలుపంచుకుందో మీరంతా చూశారు. మరో కాలేజీలో(కోల్‌కతా లా కాలేజ్ ఘటన) మరొక యువతిపై నేరం జరిగిన సంఘటన నుంచి ఇంకా దేశం కోలుకోలేదు.ఈ కేసుల్లో నిందితులకు టీఎంసీతో సంబంధాలు ఉన్నట్లు తేలింది’’ అని శాంతిభద్రతలు నిర్వహించడం, న్యాయం చేయడంలో టీఎంసీ విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు.
ముర్షిదాబాద్ లాంటి అల్లర్లు పశ్చిమ బెంగాల్‌లోనే జరుగుతాయని, పోలీసులు ఏకపక్షంగా చర్యలు తీసుకుంటారని, రాష్ట్ర ప్రజల ప్రాణాలను ప్రభుత్వం కాపాడటం లేదని ప్రధాని ఆరోపించారు. టీఎంసీ వ్యాపారాల నుంచి డబ్బు దోచుకుంటుందని, రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. టీఎంసీ గుండా టాక్స్ విధిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.