Kishan Reddy: గత ఏడాది శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో ‘మా సంకల్పం అభివృద్ధి చెందిన భారత్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించి, బ్రోచర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘మన సంకల్పం.. వికసిత్ భారత్’ అంటూ ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. వికసత్ భారత్ లో భాగంగా.. నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10:45 గంటలకు కాచిగూడ, నింబోలి అడ్డా లో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11:45 గంటలకు ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మధ్నాహ్నం 2:45 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ లో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మరోవైపు నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి కిషన్ రెడ్డి పర్యటించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకున్న అనంతరం ధారూర్ మండలం కోట్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ రూపొందించామన్నారు. మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో టూరిజంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం