V. Hanumantha Rao: రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. వీలైనప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Hanumantha Rao: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వల్పంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బీపీ కాస్త తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. అయితే తమ్మినేని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత V.హనుమంతరావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. తమ్మినేనిని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తమ్మినేని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి రాముడిపై ప్రేమ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విమర్శించారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లు రాబట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. వీరంతా అయోధ్యలో నిర్మించిన రామమందిరానికి వెళ్తారు. దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందని.. అయోధ్యలో రామమందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని అన్నారు.
Also Read
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
- Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
- OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
అయితే ప్రధాని మోదీ ఫోన్ చేసినప్పుడే మీరు అయోధ్యకు వెళ్లాలా? అతను అడిగాడు. వీలైనప్పుడల్లా అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తాం. రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని వీహెచ్ మండిపడ్డారు. 25 కోట్ల మంది పేదలను అతలాకుతలం చేశామని మోదీ చెప్పుకోవడం విడ్డూరం. ఇంతకంటే పెద్ద అబద్ధం లేదు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. మద్దతు ధర పెంచాలని రైతులు అడిగారని, ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత చిరువ్యాపారాలు చేసుకునే వారు రోడ్డున పడ్డారని అన్నారు. ఇవ్వాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి తమ్మినేనిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో తమ్మినేని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా వుండాలని అన్నారు. ఏఐజీ ఆస్పత్రిలో తమ్మినేని కుటుంబాన్ని మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పరామర్శించిన విషయం తెలిసిందే..
Security Guard Stuck Lift: కాళ్లు బయట.. లోపల తల.. లిప్ట్ లో సెక్యూరిటీ గార్డు నరకం..
తాజావార్తలు
-
Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
-
Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
-
Iran Warns US: అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే’.. అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో IRGC చీఫ్!
-
Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!