Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు బీహార్ మహఘటబంధన్ కూటమి నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తును ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. పాత మిత్రుడు బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో కూడా నితీష్ కుమార్ పాల్గొనవద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూల మధ్య పొసగడం లేదు. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. రోహిణి చేసిన ట్వీట్ గురించి నితీష్ కుమార్ సమాచారం కోరారని, ఆర్జేడీతో పొత్తుకు స్వస్తి పలికి, పదవి నుంచి వైదొలిగి, బీహార్ అసెంబ్లీ రద్దుకు కూడా సిఫారసు చేసే అవకాశం ఉందని సోర్సెస్ తెలిపాయి.
Read Also: Pragya Jaiswal : గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్.. ఇలా చూస్తే కుర్ర గుండెలు పేలిపోతాయ్..
ఇటీవల బీహార్ నేత కర్పూరీ ఠాకూర్‌కి మరణానంతరం కేంద్రం ‘భారత రత్న’ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై నితీష్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మాట్లాడుతూ.. వంశపారపర్య రాజకీయాలపై విమర్శలు చేయడంతో.. ఆర్జేడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంతా భావిస్తున్నారు. దీని తర్వాత లాలూ కుమార్తె రోహిణి చేసిన ట్వీట్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ‘ప్రజలు తరచుగా వారి స్వంత లోపాలను చూడలేరు కానీ ఇతరులపై బురద చల్లడం కొనసాగిస్తారు’’ ట్వీట్ చేశారు, ఆ తర్వాత అర్హతను ప్రస్తావిస్తూ మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ రెండు ట్వీట్లను ఆమె తొలగించారు. ఇవి పరోక్షంగా నితీష్ కుమార్‌ని అన్నట్లు తెలుస్తోంది. దీంతో వివాదం మరింత ముదిరింది.