దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
రాహుల్ గాంధీపై దాడి జరగలేదు.. కాంగ్రెస్ వారు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నమని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని, ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆరెస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బ తిన్నాయని, అయోధ్య కు రాహుల్ ఎందుకు రాలేదన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు…
Mamata Banerjee: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు ఈ రోజు కొలువయ్యాడు. 500 ఏళ్ల కల ఈ రోజు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో నిజమైంది. దేశం మొత్తం అంతా శ్రీరామ నామంతో నిండిపోయింది. అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని ప్రముఖుల, లక్షలాది మంది భక్తుల సమక్షంలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అస్సాంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు యాత్రలో పాల్గొన్న తమ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడులు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ రాష్ట్రంలో నాగోన్లో రాహుల్ యాత్ర బస్సు ముందు బీజేపీ కార్యకర్తలు ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ‘‘మోడీ..మోడీ’’ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ్న్నారు. కాగా.. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా.. శనివారం కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడింది. ఆ దాడిని కాంగ్రెస్ ఖండించింది. అధికార పార్టీ బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హక్కును 'అణచివేస్తోందని' ఆరోపించింది. రాజ్యాంగాన్ని…
DK Shivakumar: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక జరగనున్న జనవరి 22న ప్రభుత్వ సెలువు దినంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రోజు సెలవు ఇచ్చేదడి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థించారు.
బీఆర్ఎస్ను తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ , సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్కు మోడీకి గానీ, రేవంత్రెడ్డికి గానీ భయం లేదని , తెలంగాణ ప్రజల గొంతుకగా పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ , సీనియర్ జర్నలిస్టు…