Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా అస్సాంలో పర్యటిస్తున్న ఆయన, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురించి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం ఎదురుదాడి ప్రారంభించారు.
బీజేపీ ఉన్నదా ? లేదా ? అన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో KCR, KTR, కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు పోటీ చేయాలని సవాల్ చేశారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారని…
BJP: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారని, అదానీ గ్రూపుతో 12వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అదానీ, అంబానీకీ మోడీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారని, పని గట్టుకొని ప్రధానిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారని, గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.