బీహార్ అసెంబ్లీలో (Bihar) సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌కుమార్ సర్కార్ (Nitish Kumar) విజయం సాధించింది. 129 మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతుగా నిలిచారు.
విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.
నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం తాపత్రయ…
బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్‌తో బీజేపీ అందర్నీ లొంగ తీసుకుంటోందని ఆరోపించారు. సీబీఐ, జ్యూడిషియల్ ని గుప్పట్లో పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారని తెలిపారు. అధికారం కోసం పక్కా మైండ్ గేమ్ తో ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ లను మోడీ, అమిత్ షా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు జైల్ కి వెళ్లాడనికి కారణం మోడీ, అమిత్ షాలేనని రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.…
ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోస్టర్‌ను అవిస్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజలు నరేంద్ర మోడీకి కమలం పువ్వుకే ఓటేసెందుకు ముందే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు, ఆశీస్సుల కోసం 5…