INDIA bloc: ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని, ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్,…
PV Narasimha Rao: దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందంటే, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే దానికి ముఖ్యకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేసిన సంస్కరణలే కారణం. లైసెన్స్ రాజ్ నడిచే కాలంలో సరళీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానిగా పీవీ, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిని గాడి పెట్టారు. దివాళా తీసే దశ నుంచి ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టేలా ఈ ఇద్దరి ధ్వయం ఎన్నో సంస్కరణలు చేసింది.
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందులో అంతర్భాగంగా గావ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తామని ఆమె వెల్లడించారు. త్వరలో వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీలోని ప్రతి పల్లెను బీజేపీ కార్యకర్తలు సందర్శిస్తారన్నారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో పర్యటనలు ఉంటాయని ఆమె అన్నారు.…
Mood of the Nation survey: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యట్రిక్ కొట్టబోతోందని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే అంచనా వేసింది. మరోసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పింది. 2024 ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఈ సర్వే చర్చనీయాంశంగా మారింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కమాండింగ్ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, బీజేపీ చెబుతున్న 400 స్థానాల కన్నా తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.…
రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.