Sandeshkhali: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వెళ్తే, వారిపై షాజహాన్, అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
MSP: కేంద్రం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. 200 రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత తలెత్తింది. పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ వైపు ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో బారికేడ్లు, ముళ్ల కంచెల సాయంతో పోలీసులు, కేంద్ర బలగాలు వీరిని అడ్డుకున్నాయి.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో "సందేశ్‌ఖాలీ" ప్రకంపనలు రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్ర హింసలకు గురైన మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. సోమవారం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తాము ఎదుర్కొన్న అఘాయిత్యాలు., అన్యాయాల గురించి గవర్నర్ వద్ద వెల్లబోసుకున్నారు.
శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. 'సి' ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ ఈరోజు బీజేపీలో చేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామాతో పాటు అసెంబ్లీ సభ్యత్వానికి చవాన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం తన వ్యక్తిగత విషయమన్నారు. మరో రెండు రోజుల్లో తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.