BJP High Command: తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఆ మేరకు ఆ పోటీలకు అభ్యర్థుల ప్రకటనకు ముందే.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి సభలు నిర్వహించేందుకు సన్నద్దం మవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలను ప్రధాని మోడీ సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Read also: TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
ఆయా సభల కంటే ముందే రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మోడీ చేపట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే.. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో 17 స్థానాల్లో (అంటే 12 స్థానాలు) మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ 29న ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. వీరి చేరిక ప్రకారం బలాబలాల ఆధారంగా బలమైన అభ్యర్థులుగా నిలిచే వారి పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంచి అభ్యర్థుల అన్వేషణలో భాగంగా జహీరాబాద్, పెద్దపల్లి, నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Read also: Egypt: నైలు నదిలో మునిగిన బోటు.. 19 మంది కూలీలు మృతి
ఎన్నికల షెడ్యూల్ -అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం..
* ఆదిలాబాద్, సంగారెడ్డి సభలకు ప్రధాని మోడీ
* ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం చేశారు
* 4న హైదరాబాద్‌లో అమిత్ షా సమావేశం!
* 29న బీజేపీ తొలి జాబితా?
* 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి
4వ తేదీన అమిత్ షా రాకపోతే మోడీ?
వచ్చే నెల 4న హైదరాబాద్ లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే.. అదే రోజు అమిత్ షాకు బదులు మోదీ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియంలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో (ఐదు వేర్వేరు నియోజకవర్గాల్లో) విజయసంకల్పయాత్రల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో మార్చి 2న అమిత్ షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే 2వ తేదీ కాకుండా 4వ తేదీన రాష్ట్రానికి వచ్చేందుకు అమిత్ షా సమయం కేటాయించడంతో అదే రోజు సభను నిర్వహించాలని నిర్ణయించారు.
8 MLAs Disqualified: రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు.. ఆ 8 మందిపై స్పీకర్ అనర్హత వేటు