PM Modi: కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని, దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేని పీఎం దుయ్యట్టారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ దేశాన్ని చాలా ఏళ్లు పాలించిందని, అయితే వారి దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని, దేశ భవిష్యత్తుపై లేదన్నారు. శనివారం ‘విక్షిత్ భారత్ విక్షిత్ ఛత్తీస్గఢ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Assam: అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది.
New Criminal Laws: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలు చేయబడుతాయి.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కాసేపట్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో 26 జిల్లాల ఇంఛార్జ్లు పాల్గొననున్నారు. ఎలక్షన్లలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనే అంశంపై సమావేశంలో నిర్ణయించనున్నారు.
నేడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Rahul Gandhi: కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.
Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.