West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి మోడీ ఎంతో సేవ చేశారు.. టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదని కిషన్…
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
Ajit Pawar: దేశంలో మెజారిటీ ప్రజలు మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర అదికార కూటమిలో ప్రతీ ఒక్కరూ మోడీని గెలిపించడానికి పనిచేస్తున్నామని అజిత్ పవార్ ఆదివారం అన్నారు. బారామతిలో రైతుల ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
బీఆర్ఎస్, బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు. మాట మీద నిలబడి సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంతాలు లేవని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంలోనే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త నాటకంకు రెండు…
1. నేడు ఏపీలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష. ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్-2 పరీక్ష. గ్రూప్-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు. 2. నేడు కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభం. నేడు యానం ప్రభుత్వ ఆస్పత్రిలో జిప్మర్ మల్టీ స్పెషాలిటీ యూనిట్ ప్రారంభం.…
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. వరసగా ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఈ సారి బీజేపీ సొంతగా 375 సీట్లను గెలుచుకోవాలని, ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
Prashant Kishor: లోక్‌సభ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి బీజేపీనే స్వతహాగా 370 సీట్లను సాధిస్తుందని, ఎన్డీయే కూటమి 400కి మించి సీట్లను గెలుస్తుందని ప్రధాని మోడీతో పాటు కేంద్ర నాయకత్వం చెబుతోంది.
BJP: లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇటీవల ఢిల్లీ వేదికగా నేతలతో జాతీయ సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలను, ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో…