CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అడుగడుగునా ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం ఖాయం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటన, వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. అసలు దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా? అని సవాల్ చేశారు. ఏపీలో సమావేశాలు పెట్టి, సొంత భజన చేసుకునేందుకు బీజేపీకి సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ ఎంతో చేసేసిందని బాకాలు ఊదుతున్న నేతలకు ఏపీకి ద్రోహం చేసిన విషయం తెలియదా? అని నిలదీశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు ఇసుమంతైనా తగ్గించారా? అని ప్రశ్నించారు.
Read Also: Kane Williamson: మూడోసారి తండ్రైన కేన్ మామ!
ఇక, తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చి పదేళ్లయినా అమలు నోచుకోలేదే? అని ప్రశ్నించారు రామకృష్ణ.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలను బీజేపీ మూటగట్టి అటకెక్కించలేదా? అని విమర్శించారు.. రాష్ట్ర ప్రజలకు అడుగడుగునా ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం ఖాయం అని వ్యాఖ్యానించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కాగా, ఏపీలో తమ ఓటు బ్యాంక్ పెరిగిందనే.. భవిష్యత్‌లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ నేతలు చెబుతున్న విషయం విదితమే.. ఇక, టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తుండగా.. బీజేపీ నిర్ణయం కోసం ఇంత కాలం వేచిచూసి.. తొలి జాబితాను విడుదల చేశారు. ఈ రోజు ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన విషయం విదితమే.