BJP MP Laxman: రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా?.. రాముడికి గుడి కట్టిన మోడీ కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Vijaya Sankalpa Yatra: రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా? లేదా రాముడికి గుడి కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ అన్నారు. హిందువుల కోసం అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోడీ అని అన్నారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందే అని లక్ష్మణ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలతో కమలదళం ముందుకెళ్తోంది. రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నేడు ఎంపీ డా లక్ష్మణ్ గౌలిపురాలో విజయ సంకల్ప యాత్ర చేశారు.
గౌలిపురాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో పాత బస్తీ మొత్తం కాషాయ మయంగా మారింది. గౌలిపురాలో ఎంపీ డా లక్ష్మణ్ మాటాడుతూ… ‘ప్రధాని మోడీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాము. విజయ సంకల్ప యాత్రకు గ్రామాల్లో, పట్టణాల్లో ఘన స్వాగతం పుకుతున్నారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోడీ. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ. రాముడే లేదు.. రామునికి గుడి ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ అంది. ఇపుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో?, రాముడికి గుడి కట్టిన మోడీ కావాలో ప్రజలు ఆలోచించాలి’ అని అన్నారు.
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
‘కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ షా గెలిచిన సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. మన దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ దేశంకి జిందాబాద్ అనడం సిగ్గు చేటు. కాంగ్రెస్ అధిష్టానం వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దేశం సస్యసామలంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వంతోనే సాధ్యం. నేను ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాను. అక్కడ సీఎం యోగి అధిత్యనాథ్ గ్యాంగ్ స్టార్స్ మాఫియాను బుల్డోజర్లతో కూల్చేశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో బీజేపీని గెలిపిస్తే సస్యసామలంగా మారుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీ తొత్తులుగా మారి.. పాత బస్తిని డెవలప్ జరగకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం కోసం పని చేస్తుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం ప్రజల కోసం, దేశం కోసం పని చేస్తుంది. పాతబస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందే’ అని ఎంపీ డా లక్ష్మణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!