సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అయితే.. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టైం బాగా లేక ఓడిపోయా.. ఓడిపోయినా.. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు.. కృతజ్ఞతలు అని అన్నారు. గాంధీ భవన్ లో పార్టీ కోసం పని చేస్తున్నానని తెలిపారు.
Read Also: Laxman: కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది..
ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద బండి సంజయ్ మాటలు సరికాదని అన్నారు. పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని కోరారు. శ్రీరాముడు తల్లి మాటలు విని అడవికి పోయాడు.. రాముడు తల్లిని గౌరవించాడు.. మరి నువ్వు పొన్నం తల్లిని ఎందుకు గౌరవించలేదు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. శ్రీ రాముడిని మోడీ, సంజయ్, కిషన్ రెడ్డిలే మొక్కుతున్నట్టు.. దునియాలో ఎవరు మొక్కడం లేదన్న బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. శ్రీరాముడు ఆదర్శ మూర్తి.. రానున్న తరాలకు ఆదర్శం.. ఆదర్శంగా బతకాలి అని చెప్పాడని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ నేతలు రాముడి పేరు మీద ఓట్లు అడిగుతున్నారని మండిపడ్డారు.