Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల తర్వాత ఏ పార్టీ బలం ఎంత..? బీజేపీ మెజారిటీ సాధించిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Elections: క్రాస్ ఓటింగ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది.
ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాలను చూస్తే 97 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు. సభలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కి 29, తృణమూల్ కాంగ్రెస్‌కి 13 మంది, డీఎంకే, ఆప్‌లకు 10 మంది, బీజేడీ, వైఎస్ఆర్సీపీకి 9 మంది, బీఆర్ఎస్‌కి ఏడుగురు, ఆర్జేడీకి ఆరుగురు, సీపీఎంకి ఐదుగురు, ఏఐడీఎంకే, జేడీయూలకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
Read Also: YSRCP: వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్.. పార్టీ బంపర్ ఆఫర్!
మంగళవారం ఎన్నికలు జరిగిన 56 సీట్లలో 41 ఏకగ్రీవం కాగా.. 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 56 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ 30 స్థానాలను దక్కించుకుంది. దీంతో బీజేపీకి మొత్తంగా 97 ఎంపీలు ఉండగా.. ఎన్డీయేకి కలిపి 117 ఎంపీల సంఖ్యా బలం ఉంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. మెజారిటీకి 121 మంది సభ్యులు అవసరం. అయితే, ప్రస్తుతం బీజేపీకి మెజారిటీకి నలుగురు మాత్రమే తక్కువగా ఉన్నారు.
కర్ణాటకలో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. రెండింటిని ఎస్పీ గెలుచుకుంది. నిజానికి బీజేపీకి సొంతగా 7 స్థానాలు గెలుచుకునే అవకాశమే ఉన్నప్పటికీ.. ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో మరో స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకైక స్థానాన్ని బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలువలేకపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి ఓటేయడంతో కమలం అభ్యర్థి గెలుపొందారు.
తాజావార్తలు
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!