Nitin Gadkari: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో సీటు రాకపోవడంతో కొద్దిగా సైలెంట్ గా ఉండిపోయిన ఆయన.. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 20 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాలో నితిన్ గడ్కరీ పేరు వచ్చింది. దీంతో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత నితిన్ గడ్కరీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ.. కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే వివాదాస్పద చట్టానికి సంబంధించిన ప్రశ్నపై చర్చించారు.
Read Also: Madhyapradesh : దొంగతనానికి వచ్చి 12ఏళ్ల చిన్నారిని 25సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో మార్పులు చేస్తుందని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే రాష్ట్రంలో హిందూ వ్యతిరేక మార్పులను రద్దు చేస్తామని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే అన్నారు. లేక తనకు మెజారిటీ వస్తుందో లేదో అని శాసనసభలో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం మాకు లేదు.. మేము అలాంటి ప్రణాళిక ఏదీ చేయలేదు.. రాజ్యాంగాన్ని మార్చడం తప్పు.. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఇలాంటివి మాట్లాడొద్దు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. అయితే, అనంత్‌కుమార్ హెగ్డే తన వ్యక్తిగత వ్యాఖ్యలను బీజేపీకి అంటించొద్దు అని గడ్కరీ పిలుపునిచ్చారు.