Kishan Reddy : అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్హాశాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానమన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లో ఇవాళ ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతమని, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ ‑ మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా మనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో స్వామి వివేకానందుడు అందించిన సందేశం యావత్ ప్రపంచానికి భారతదేశ తత్వాన్ని మరోసారి గుర్తుచేసిందని, భారతదేశం ప్రపంచంలోని దేశాలన్నింటికీ మిత్రదేశమని కిషన్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా..’ప్రపంచంలో ఎక్కడ ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నా.. భారతదేశం శాంతిమంత్రాన్నే బోధించింది. భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు. హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం. ఈ మతాలన్నీ శాంతి, సామరస్యం, పరోపకారాన్ని ప్రపంచానికి బోధించాయి. ప్రాచీనకాలం నుంచి భారతదేశం ఆత్మశోధనకు కేంద్రంగా ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తత్వవేత్తలు, మేధావులు స్వయంశోధనకు భారతదేశం వచ్చేవారు. భారతదేశంలో తత్వవేత్తలు సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు కృషిచేశారు. ఇందులో ఆదిశంకారాచార్య, రామానుజాచార్య, బసవణ్ణ.. తర్వాత.. శ్రీ అరబిందో, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఇందుకు కృషిచేశారు. ప్రపంచమంతా ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు భారత్ మొదట్నుంచీ కృషిచేస్తోంది. ఇకపైనా ఈ ప్రయత్నం కొనసాగనుంది. ప్రపంచశాంతి లక్ష్యంగా ఉద్దేశించిన ఈ కార్యక్రమం సంకల్పిత లక్ష్యాలను చేరుకోగలదనే విశ్వాసం నాకుంది. ఈ దిశగా మీ అందరి సహకారం కావాలి’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్, శ్రీమతి సుదేశ్ జగదీప్ ధన్‌ఖర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ సాంస్కృతిక మంత్రి శ్రీ జూపల్లి ష్ణారావు, గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్‌ఫుల్‌నెస్ శ్రీ కమలేశ్ డి పటేల్ (దాజీ) తోపాటుగా.. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక విధానాలను అనుసరించే స్పిరిచువల్ గురువులు పాల్గొన్నారు.
Also Read
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!