ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే, కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా అని కమలం పార్టీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అలాగే, అనపర్తి అభ్యర్థి విషయంలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తాజాగా వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్ కు తిరుపతి లోక్ సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది.
Read Also: BSP First List : బీఎస్పీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల
బీజేపీ లోక్ సభ అభ్యర్థులుగా..!
• రాజమండ్రి- పురందేశ్వరి
• అనకాపల్లి- సీఎమ్.రమేశ్
• అరకు- కొత్తపల్లి గీత
• రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
• తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎంపీ)
• నరసాపురం- శ్రీనివాస వర్మ ( ఏపి బిజేపి రాష్ట్ర కార్యదర్శి)
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే..!
* ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు
* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
* బద్వేలు – పనతల సురేష్
* ఆదోని – పార్దసారధి
* పాడేరు – ఉమా మహేశ్వరరావు
* ధర్మవరం – వరదాపురం సూరి లేదా సత్యకుమార్
* జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
* కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి
* వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు