Bengal BJP: “మాకు ఒక్క సీటు ఎక్కువ వచ్చినా..” మమతా బెనర్జీ సర్కార్ ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal BJP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.
Read Also: Family Suicide Case: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ కేసులో పోలీసులు ఏమన్నారంటే?
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకు 35 సీట్లలో గెలవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. 2026 పదవీ కాలం పూర్తి కాకముందే టీఎంసీ ప్రభుత్వం పడిపోతుందని, దీనికి వంశరాజకీయాలు కారణమని అన్నారు. మహారాష్ట్రలో శివసేన- ఏన్సీపీ- కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీ కారణం కాదని, ఉద్ధవ్ ఠాక్రేకి తన కొడుకుపై ఉన్న ప్రేమ, శరద్ పవార్‌కి తన కూతురు సుప్రియా సూలేపై ఉన్న ప్రేమే కారణమని అన్నారు. వారి కుటుంబ రాజకీయాలే పతనానికి కారణమని అన్నారు. బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీకి అల్లుడు అభిషేక్ బెనర్జీపై ఉన్న ప్రేమ దెబ్బతీస్తుందని చెప్పారు.
294 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర శాసనసభలో బీజేపీకి 74 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. టీఎంసీకి 217 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఏఏపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హింసించబడిన హిందువుకు ఈ చట్టం పెద్ద ఉపశమనం అని ఆయన అన్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో ఉంటున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ హిందువులను రక్షించడమే సీఏఏ లక్ష్యమని అన్నారు. సీఏఏపై బెంగాల్ మైనారిటీల్లో భయాందోళన సృష్టించడానికి టీఎంసీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఈసారి ముస్లింలు కూడా టీఎంసీ సిద్ధాంతాలను నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!