Off The Record : లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ వ్యూహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలను బిజెపి తెలంగాణలో లాంచింగ్ ప్యాడ్‌లా ఉపయోగించుకోవాలని అనుకుంటోందా? కేవలం ఎంపీ సీట్లతో సరిపెట్టకుండా… ఆ బేస్‌తో రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయా? కాషాయదళం ఏక కాలంలో అమలు చేయాలనుకుంటున్న ఆ ప్లాన్స్ ఏంటి? ఎన్ని ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలన్న టార్గెట్‌తో టీ బీజేపీ రంగంలోకి దిగింది? తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. ఆ పరంగా క్లారిటీ వచ్చేసింది గనుక ఇక ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించింది. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టుగా కాకుండా… తమకు బలం ఉన్న, బలంలేని నియోజకవర్గాలను విడి విడిగా లిస్టౌట్ చేసుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీ శ్రేణులకు సైతం ఆ కోణంలోనే దిశా నిర్దేశం జరుగుతోందట. రాష్ట్రంలో కనీసం పది లోక్‌సభ సీట్లు,35 శాతానికి పైగా ఓట్లు సాధించాలని అదిష్టానం టార్గెట్ పెట్టినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం తెలంగాణలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి… ఇక్కడే కట్టడి చేయాలన్న ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నది పార్టీ వర్గాల టాక్. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుండి రిపోర్ట్‌లు ఢిల్లీ వెళ్తున్నాయట. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సర్వేలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ విశ్లేషించి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. బీజేపీ నాలుగు సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జండా ఎగురేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిసింది. అలాగే నాగర్ కర్నూల్, వరంగల్ నియోజక వర్గాలలో కూడా పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు టీ బీజేపీ నేతలు. ఈ 12 నియోజక వర్గాలను A, B కేటగిరీలుగా విభజించి ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారట.
ఇక బలహీనంగా ఉన్నామనుకుంటున్న పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండల్లో ఇంప్రూవ్ కావడానికి ఏం చేయాలనే దాని పై కమలం కసరత్తు జరుగుతోందంటున్నారు. మోడీ చరిష్మా, పార్టీ పట్ల ఉన్న సానుకూల వాతావరణంతో ఆ నియోజక వర్గాల్లో కూడా బలపడే ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రతి బూత్ నుంచి కనీసం ఐదురుగు కార్యకర్తలు తయారు చేయాలన్నది పార్టీ ప్లాన్‌గా తెలిసింది. వివిధ క్షేత్రాలు, ధార్మిక సంస్థల సహకారంతో బలహీన నియోజకవర్గాల్లో పాగా వేయాలన్న ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణలో లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారట బీజేపీ పెద్దలు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రభావం తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికలకి ఉపయోగ పడేలా చూసుకోవాలన్నది పార్టీ ప్రణాళికగా తెలిసింది. మొత్తంగా ఎంపీ ఎలక్షన్స్ ప్లానింగ్‌నే పక్కాగా చేసుకుని బలమైన శక్తి గా ఎదగడంతో పాటు స్తానిక సంస్థల ఎన్నికల ద్వారా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటోంది కమలం పార్టీ. అదే సమయంలో ఎంపీ ఎలక్షన్స్ ఫలితాలను బట్టే తదుపరి అడుగులు ఉంటాయన్న వాదన సైతం వినిపిస్తోంది. దీంతో కాషాయ పార్టీ ప్లాన్స్‌ని జాగ్రత్తగా గమనిస్తున్నారు పరిశీలకులు, రాజకీయ ప్రత్యర్థులు.
Also Read
- Tags
- bjp
- ntv
- off the record
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!